వ్యవసాయ మార్కెట్లతోపాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద నిర్వహిస్తున్న కాంటాల్లో తేడాలు ఉంటున్నాయి. ప్రామాణికమైన తూకం రాళ్లకు బదులుగా సాధారణ బండరాళ్లను వినియోగిస్తున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లీగల్ మెట్రాలజీ అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి.
– వర్దం సైదులు, అచ్చంపేట
మోసాలను అరికట్టాలి..
నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు ఇలా ఏవైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళితే తూకాలలో మోసాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ తూకాలు వాడాల్సిన చోట చాలా వరకు మ్యాన్‌వల్ తూకాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తూకాలలో మోసాలు పెరిగి కష్టమర్లు నష్టపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మోసాలను అరికట్టాలి.
– నాయుడు, గద్వాల
పర్యవేక్షణ లేదు..
ప్రస్తుతం బంగారు ధర ఆకాశంలో ఉంది. శుభాకార్యలకు కొనుగోలు చేసేందుకు వెళితే తూకాలలో మోసాలు జరిగి కష్టమర్లు చాలా నష్టపోతున్నారు. దీనిపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కష్టమర్లు నష్టపోకుండా చూడాలి.
– రమేష్, గద్వాల
●


