‘పది’ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలు ప్రారంభం

Mar 15 2026 5:08 AM | Updated on Mar 15 2026 5:08 AM

గద్వాల: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. కాగా.. తొలిరోజు మొత్తం 8,055 మంది విద్యార్థులకు గాను 8,038 మంది హాజరవగా.. 17 మంది గైర్హాజరు అయ్యారని డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ గద్వాల పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, అదేవిధంగా మాప్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని చెప్పారు. వేసవి దృష్ట్యా తాగునీటి వసతి, ఫ్యాన్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా డీఈఓ విజయలక్ష్మి పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు చేశారు.

తొలిరోజు 16మంది గైర్హాజరు

Advertisement
 
Advertisement
Advertisement