బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

Mar 15 2026 5:08 AM | Updated on Mar 15 2026 5:08 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికై న బీసీ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని పార్లమెంట్‌ వద్ద అనేక సార్లు ధర్నాలు చేపట్టాలని, పలువురు మంత్రులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఈ విషయంలో వి/్ఞప్తి చేశామన్నారు. ఈ క్రమంలో కొన్ని డిమాండ్‌లను కేంద్రప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ద హోదా, కేంద్రంలో ఓబీసీల వర్గీకరణకు అంగీకరించిందని, అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి రూ.90 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు జీఓలు జారీ చేసిందని తెలిపారు. మరో రెండు డిమాండ్‌లు అలాగే ఉండిపోయాయని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలు, ఇతర పాఠశాలల మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ, విద్య విషయాల్లో ఇచ్చే రిజర్వేషన్‌ను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 40 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలోమాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ మమత, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య

Advertisement
 
Advertisement
Advertisement