మైనర్లు పెడదోవ!
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేయాలి. వారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా స్వయంగా వా రి అవసరాలను గుర్తించి తీర్చాలి. పిల్లలు వాహనాలు నడపడం తప్పు అనే విషయాన్ని గ్రహించాలి. రోడ్డుపై వాహనం నడిపే క్రమంలో మైనర్లకు సరైన అవగాహన, సామర్థ్యం ఉండకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయి. వినోదాలతో చేసే కార్యక్రమాలను నిలువరించాలి. డబ్బు విలువ తెలియజేయాలి. చెడు వ్యసనాలకు దారితీస్తున్న అంశాలను తెలుసుకుని సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలి.
– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల
గద్వాల క్రైం: మైనర్ల వింత పోకడలు అధికమయా యి. నానాటికీ సరదా వ్యసనాలపై మోజు పడు తూ.. ఒకరిని చూసి మరొకరు చెడు అలవాట్లకు బానిసగా మారుతున్నారు. ముఖ్యంగా మైనర్ల చేతి లో బైక్ ఉంటే చాలు.. వారి స్పీడ్‌కు కళ్లెం వేయలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రయ్.. రయ్‌మంటూ హల్‌చల్ చేస్తున్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ సమయంలో పోలీసులకు దొరికిన ఘటనలు అనేకం ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. పిల్లలపై తల్లిదండ్రుల నిఘా కొరవడి.. చేజుతుల్లారా వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు.
మత్తు పదార్థాలకు బానిసై..
చాలా మంది మైనర్లు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. తమ వద్ద డబ్బు లు లేకపోతే ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులు చోరీ చేయడం.. వాటిని తక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన డబ్బులతో మద్యం, పొగాకు, పాన్ మాసాల వంటి వాటిని తీసుకుంటున్నారు. ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే స్నేహితులందరూ పట్టణ శివారు ప్రాంతానికి చేరుకొని వేడుకలు జరు పుకొంటున్నారు. అర్ధరాత్రి దాటగానే నడిరోడ్డుపై కేక్ కట్ చేసి.. హంగామా చేయడం సాధారణంగా మారింది. కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నా రో తెలియని పరిస్థితికి చేరి.. కేక్‌ను ముఖానికి రుద్దడం, బర్తడే బంప్స్ పేరుతో ఇష్టమొచ్చినట్లు కొట్టడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ వింత పోకడ పల్లెలకూ సైతం పాకింది. ఏదైనా కార్యక్రమం ఉందటే చాలు.. వారికి పండుగ వాతావరణంగా మారుతుంది. ఒకరిని చూసి మరొకరు చెడు వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లలు వక్రమార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి.
బైక్‌లతో రయ్.. రయ్‌మంటూ హల్‌చల్
అడ్డుకట్ట వేయని కుటుంబ సభ్యులు
పోలీసుల తనిఖీలో
పట్టుబడుతున్నా మారని తీరు
చెడు వ్యసనాలకు బానిసగా
మారుతున్న వైనం
మైనర్లు పెడదోవ!


