పీఆర్సీ ప్రకటించాలి
ఉప్పునుంతల: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని తాడూరు యూపీఎస్‌లో నిర్వహించిన డీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నం.25ను రద్దుచేసి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు డి భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రత్నప్రసాద్, కె.జ్యోతి, కార్యదర్శులు పి.జానకీరాం ఉన్నారు.


