శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Feb 27 2026 7:55 AM | Updated on Feb 27 2026 7:55 AM

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

గద్వాల క్రైం: జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీసులు శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేయాలని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్‌ కేసులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విలేజ్‌ రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలన్నారు. ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, పేకాట వంటి వాటిని కట్టడి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంచాలన్నారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసి.. నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, ప్రదీప్‌కుమార్‌, రవి, నాగేశ్వరెడ్డి, ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్‌, శ్రీకాంత్‌, శేఖర్‌, మల్లేష్‌, శ్రీహరి, నందికర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement