దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం అర్హత గల ప్రైవేటు పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉ మాపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. స్టేట్ లేదా సెంట్రల్ బోర్డు గుర్తింపు పొంది.. గత ఐదేళ్లలో 7, 10వ తరగతుల్లో కనీసం 90 శాతం ఉత్తీర్ణత శాతం నమోదై ఉండాలని.. 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాఽ దించాలని పేర్కొ న్నారు. అదే విధంగా పాఠశాలలలో విశాలమైన తరగతి గదు లు, క్రీడా ప్రాంగణం, విద్యార్థులకు తగిన సౌకర్యాలు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, 50 శాతం కంటే ఎక్కువ సాధారణ సిబ్బంది ఉండాలన్నారు. అర్హత గల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో మార్చి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


