
తాగునీటి సమస్య తీర్చండి
అయిజ: గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని, అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ మండల ప్రసిడెంట్ గోపల కృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పలలో గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులకు గ్రామ ప్రజలు తాగునీటి సమస్య గురించి తెలిపారు. అదేవిధంగా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగాబీజేపీ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి మౌళిక వసతులు కల్పించడంలేదని, కనీసం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంలేదని మండిపడ్డారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని, స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, నరసింహులు, రవి, శంకరన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.