లక్ష్యం.. నిర్దేశం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. నిర్దేశం

May 19 2025 2:24 AM | Updated on May 19 2025 2:24 AM

లక్ష్యం.. నిర్దేశం

లక్ష్యం.. నిర్దేశం

గద్వాల వ్యవసాయం: జిల్లాలోని గద్వాల, అలంపూర్‌ మార్కెట్‌యార్డులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు మార్కెట్‌యార్డులకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. ఈఏడాది కూడా పంట ఉత్పత్తులు యార్డులకు బాగా వచ్చి లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ పరిధిలోని ఏడు రిజర్వాయర్లు, 120దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా వానాకాలం సీజన్‌లో 1.27లక్షల హెక్టార్లు, యాసంగిలో 48వేల హెక్టార్లలో వరి, పత్తి, కంది, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఎండుమిర్చి తదితర పంటలు రైతులు పండిస్తున్నారు. పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గద్వాల, అలంపూర్‌ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఇందులో అలంపూర్‌ మార్కెట్‌యార్డుకు అయిజ సబ్‌మార్కెట్‌గా ఉంది.

యార్డులకు ఆదాయం ఇలా..

యార్డులలో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలపై మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి లెక్కన యార్డుకు సెస్‌ వస్తుంది. ఇతర ప్రాంతాలకు పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకెళ్తే చెక్‌పోస్టుల వద్ద కూడా యార్డులు మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి వసూలు చేస్తాయి. ఇదిలాఉండగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌యార్డులకు ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. 2025–26కి గాను గద్వాల యార్డుకు రూ. 5.25 కోట్లు, అలంపూర్‌ యార్డుకు రూ. 4 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. కాగా 2024–25లో గద్వాల యార్డు నిర్దేశించిన లక్ష్యం రూ. 4.24కోట్లకు గాను రూ.4.77కోట్లు, అలంపూర్‌ యార్డు లక్ష్యం రూ.2.44కోట్లకు గాను రూ. 4.07 కోట్లు సాధించాయి. జిల్లాలో ఏడాది అంతా వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. దీనివల్ల ఆదాయం బాగా వస్తుందని చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వల్ల కూడా ఆదాయం వస్తుందని, వీటన్నింటి వల్ల లక్ష్యం మేరకు ఆదాయం లభిస్తుందని అంననా వేశారు. ఇక అలంపూర్‌ మార్కెట్‌యార్డుకు విషయానికి వస్తే ఇక్కడ రోజువారి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిర్వహించరు. లైసెన్స్‌ ఉన్న ట్రేడర్స్‌ రైతుల నుంచి కొన్ని సార్లు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు యార్డుకు సెస్‌ లభిస్తుంది. ఈమార్కెట్‌ యార్డు పరిది కింద ఎర్రవల్లి, పుల్లూరు, అయిజలలో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టుల నిర్వహణ ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. మిల్లుల నుంచి కూడా ఆదాయం వస్తోంది. అయిజ సంత నుంచి రెండేళ్లుగా ఆదాయం బాగా పెరిగింది.

మార్కెట్‌ యార్డు నుంచి 2.50

ప్రభుత్వ రంగ సంస్థలు 1.26

మిల్లులు 1.15

చెక్‌పోస్టులు 0.25

పశువుల సంత 6 లక్షలు

కూరగాయల మార్కెట్‌ 3లక్షలు

గద్వాల యార్డులో వరి ధాన్యాన్ని కాంటా వేస్తున్న కార్మికులు

(ఫైల్‌)

అలంపూర్‌ యార్డు లక్ష్యం ఇలా.. (రూ.కోట్లలో)

చెక్‌పోస్టుల నుంచి 2.00

మిల్లులు, ట్రేడర్స్‌ 1.10

ప్రభుత్వ రంగ సంస్థలు 0.70

సంత నుంచి 0.20

గతేడాది గద్వాల, అలంపూర్‌

యార్డులకు రికార్డు స్థాయిలో ఆదాయం

జిల్లా కేంద్రంలో జోరుగా పంట

ఉత్పత్తుల క్రయ విక్రయాలు

ఈ ఆర్థిక సంవత్సరం

గద్వాలకు రూ.5.25 కోట్లు..

అలంపూర్‌కు

రూ.4 కోట్లు ఆదాయ లక్ష్యాల నిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement