వెంకటాపురం(ఎం): రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపు కొనసాగుతోంది. వలంటీర్ శిక్షణ శిబిరం ఆదివారం పదో రోజుకు చేరుకుంది. శిక్షణలో భాగంగా వలంటీర్లు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను సందర్శించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకొని అబ్బురపడ్డారు. లక్నవరం సరస్సు అందాలను వీక్షించి తమ ఫోన్లలో సెల్ఫీలు దిగారు. గణపురం కోటగుళ్లని సందర్శించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్‌రావు ఆలయాల చరిత్ర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ సభ్యులు శ్రీని వాస్, రాష్ట్ర పురావస్తు శాఖ పోర్మెన్ బాబు పాల్గొన్నారు.


