వనదేవతలకు మొక్కులు | - | Sakshi
Sakshi News home page

వనదేవతలకు మొక్కులు

Nov 2 2026 1:11 AM | Updated on Nov 2 2026 1:11 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకున్న భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు.

గణపురం: వరల్డ్‌ హెరిటేజ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను పరిశోధక బృందం సభ్యులు సందర్శించారు. ప్రొఫెసర్‌ పాండురంగారావు ఆధ్వర్యంలో సందర్శించి కోటగుళ్ల చరిత్రను తెలుసుకున్నారు. బృందం సభ్యులు ఆలయ శిల్ప సంపదను తిలకించారు. ఆలయ నిర్మాణ విధానం, ప్రాముఖ్యత తదితర అంశాలను పాంగురంగారావు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇంటాక్‌ నుంచి శ్రీధర్‌రావు, పురావస్తు శాఖ ఫోర్‌మెన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement