పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించాలి

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రజలు, ప్రజాసంఘాలు ఉద్యమించాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం భూపాలపల్లిలోని కొమురయ్య భవన్‌లో జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్‌లో 20శాతం, కేంద్ర ప్రభుత్వం జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 16వేల పాఠశాలలు ఏకోపాధ్యాయులతో కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల భూములను ఆక్రమణల నుంచి కాపాడాలన్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కామన్‌ స్కూల్‌ విద్యావిధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఐత తిరుపతి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి బానోతు సేవానాయక్‌తో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement