ఓసీ–3లో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఓసీ–3లో తప్పిన ప్రమాదం

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

గణపురం: గణపురం మండలం పరుశరాంపల్లి శివారులోని ఓసీ–3లో గురువారం పెను ప్రమాదం తప్పింది. ఓసీ–3లో బాంబ్‌ బ్లాస్టింగ్‌ కార్మికులు ఉన్నప్పుడే అధికారులు హెచ్చరిక లేకుండా వేరే వ్యక్తులతో బాంబ్‌ బ్లాస్టింగ్‌ చేశారు. కార్మికుల కథనం ప్రకారం.. ఓపెన్‌ కాస్టు గనిలో 82 మంది బాంబ్‌బ్లాస్టింగ్‌ కార్మికులుగా పని చేస్తున్నారు. రోజు 56మంది వచ్చి విధుల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రతీ నెల తమకు 26 రోజులు మస్టర్లు వేయాలని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వారం రోజుల గడువు పెట్టారు. ఇది బుధవారానికి ముగిసింది. దీంతో గురువారం పనులు అడ్డుకోవడానికి బ్లాస్టింగ్‌ రెగ్యులర్‌ కార్మికులు రాగా అప్పటికే నూతన వ్యక్తులను తీసుకొచ్చిన అధికారులు హెచ్చరిక లేకుండానే గనిలో బాంబ్‌ బ్లాస్లింగ్‌ చేయించారు. దీంతో కార్మికులు చెల్లా చెదురయ్యారు. ఓసీ–3 మేనేజర్‌ కావాలనే బ్లాస్టింగ్‌ చేశారని ఆందోళనకు దిగారు. ఓసీ–3లో కార్మికులు ఉండగానే బాంబ్‌ బ్లాస్టింగ్‌ చేయడం తప్పేనని ఇన్‌చార్జ్‌ ఓసీ–3 మేనేజర్‌ శ్యాంసుందర్‌ అన్నారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు తాము, పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.

మస్టర్లు వేయాలని బ్లాస్టింగ్‌ కార్మికుల ఆందోళన

అదే సమయంలో బ్లాస్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement