ఉపాధి పనులకు సాంకేతిక నిఘా! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులకు సాంకేతిక నిఘా!

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

జిల్లా వివరాలు

కాళేశ్వరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌–గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌’ (వీబీ జీ రామ్‌ జీ)ను కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పనుల పర్యవేక్షణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానంలో చోటుచేసుకున్న నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలు, బినామీలు వ్యవస్థతో చెక్‌ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత పర్యవేక్షణకు చట్టబద్ధత కల్పించడం ఈ విధానంలో ప్రధాన మార్పుగా నిలిచింది. దీంతో ఉపాధి హామీ పథకం అమలు మరింత పారదర్శకంగా మారనుంది.

డ్రోన్లతో నిఘా!

కొత్త విధానంలో ఇస్రో భువన్‌ పోర్టల్క్‌ చెందిన శాటిలైట్‌ చిత్రాలను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రతీ జిల్లాలో అంబుడ్స్‌మను డ్రోన్‌ పర్యవేక్షణ సౌకర్యం కల్పించనున్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని తప్పుడు కొలతలు నమోదు చేసే అవకాశాలను పూర్తిగా నియంత్రణ వ్యవస్థను రూపొందించారు. శాటిలైట్‌, డ్రోన్‌ ద్వారా నమోదైన కొలతలు, ఎంబీల్లో నమోదైన వివరాలు సరిపోలకపోతే వెంటనే విచారణ చేపడుతారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారుల ఐడీలను నిలిపివేయడంతో పాటు రికవరీ చర్యలు చేపట్టనున్నారు.

గ్రామపంచాయతీలు 248

ఫీల్డ్‌ అసిస్టెంట్లు 130

ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఖాళీలు 118

జాబ్‌ కార్డులు 1,06,463

ఆక్టివ్‌ జాబ్‌ కార్డులు 66,016

పని దినాల లక్ష్యం 25.26లక్షలు

నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలకు ఇక కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement