11వ రోజుకు చేరిన దీక్షలు | - | Sakshi
Sakshi News home page

11వ రోజుకు చేరిన దీక్షలు

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

భూపాలపల్లి అర్బన్‌: కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో భూపాలపల్లి జీఎం కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 11వ రోజుకు చేరాయి. పే అప్‌గ్రేడేషన్‌, పీఆర్‌పీ అమలు చేయడంతో పాటు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన దీక్షలో సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పెద్దింటి విశ్రాంత్‌ కుమార్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఎలిగేటి సందీప్‌కుమార్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పాక రాహుల్‌, డిప్యూటీ మేనేజర్‌ బిట్ల రాజా రవితేజ, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌, డిప్యూటీ మేనేజర్‌ పుల్లూరి కార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గుగులోత్‌ నాగేందర్‌, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రాహుల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement