అక్రమ వినియోగంపై నిఘా.. | - | Sakshi
Sakshi News home page

అక్రమ వినియోగంపై నిఘా..

Mar 15 2026 1:21 AM | Updated on Mar 15 2026 1:21 AM

ఎల్‌పీజీ సిలిండర్లు దాచివేత, బ్లాక్‌ మార్కెటింగ్‌, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్యానికి వినియోగించడం వంటి అక్రమాలపై కఠిన నిఘా ఉంచినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరా పరిస్థితిపై జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్‌ కమిటీతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో గ్యాస్‌ సరఫరా అందుబాటును నిరంతరం పర్యవేక్షించేందుకు మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, గ్యాస్‌ ఏజెన్సీలను జిల్లా అధికారులు సమన్వయం చేస్తూ వినియోగదారులకు అంతరాయం లేకుండా గ్యాస్‌ సరఫరా కొనసాగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్‌ సిలిండర్లు ప్రాధాన్యతతో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్‌ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

– రాహుల్‌ శర్మ, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement