టెన్త్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

Mar 15 2026 1:21 AM | Updated on Mar 15 2026 1:21 AM

నలుగురు విద్యార్థులు గైర్హాజరు

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి పాఠశాల, ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ జంగేడు పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి పరీక్ష నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి గణపురం మండలకేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు. 3,544 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్‌ వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్‌ మహాముత్తారం, మహదేవపూర్‌ పాఠశాలలను సందర్శించారు. రెండు ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షణ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement