జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో భాగంగా గురువారం నెలవారీ తనిఖీల సందర్భంగా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫారమ్–6తో దరఖాస్తు చేసుకోవాలి
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని గతంలో నమోదైన ఓటర్లు సైతం తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు ఫారమ్–6 సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో గతంలో ఓటరుగా నమోదైన వారు ఫారమ్–6తో పాటు డిక్లరేషన్ సమర్పించడానికి అవకాశం ఉందన్నారు.


