క్రమశిక్షణ అలవడేలా.. ప్రణాళికతో సాగేలా! | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ అలవడేలా.. ప్రణాళికతో సాగేలా!

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

విద్యార్థుల సమగ్రాభివృద్దికి కృషి

జనగామ రూరల్‌: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలో జిల్లాలోని కొడకండ్ల, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నర్మెట, బచ్చన్నపేట, చౌడారంలోని ఐదు పీఎంశ్రీ మోడల్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2500 మందికి డైరీలను అందించింది. అలాగే జిల్లాలో 15 పీఎంశ్రీ పాఠశాలలు ఎంపిక కాగా ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చదువులపై మరింత జాగృతం చేసేందుకు విద్యాశాఖ తొలిసారిగా డైరీల పంపిణీ చేపట్టింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో కనిపించే డైరీలు ఇక నుంచి పీఎంశ్రీ విద్యార్థుల చేతుల్లోనూ కనిపించనున్నాయి.

విద్యార్థుల క్రమశిక్షణకు దోహం

ప్రభుత్వం పంపిణీ చేసిన డైరీలో ప్రతీరోజు వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది. దీర్ఘకాలంలో తన జీవితంలో సమయం వృథా చేయకుండా ప్రణాళికబద్ధంగా ఎలా ముందుకు సాగాలో నేర్చుకునే అవకాశం ఉంటుంది.

జిల్లాలో 20 పీఎంశ్రీ పాఠశాలలు

జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5 మోడల్‌ పాఠశాలు ఉండగా 15 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 5 వేల మంది ఈ విద్యా సంవత్సరంలో విద్యనభ్యసిస్తున్నారు.

విద్యార్థులు చదువుతో పాటి వారి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నిబద్ధత ప్రణాళికలు, క్రమశిక్షణ అలవర్చుకోనేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా దైనందిన కా ర్యకాలాపాలకు డైరీలు ఉపయోగపడుతాయి.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

పీఎంశ్రీ విద్యార్థులకు డైరీల పంపిణీ

5వేలకు పైగా విద్యార్థులకు

అందజేసేందుకు ఏర్పాట్లు

సమగ్ర వివరాలు ఉండేలా రూపకల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement