విద్యార్థులకు అందించే డైరీలో వారికి సంబంధించి సమగ్ర వివరాలు రాసుకునే విధంగా అవకాశం ఉంటుంది. పాఠశాల, ఇంట్లో చేసిన, చేయాల్సిన పనుల వివరాలతోపాటు పరీక్షలు, సెలవులు, పనిదినాలు వంటి అంశాలతో డైరీని సమగ్రంగా సిద్ధం చేశారు. డైరీలో కవర్‌పేజీతో పాటు తర్వాతి పేజీలో విద్యార్థి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఫొటో, పేరు, తరగతి, రూల్‌నంబర్, ప్రవేశ సంఖ్య, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, ఆధార్, సెల్‌నంబర్, పాఠశాల పేరు, యూఐడీ నంబర్ వివరాలు పొందు పరిచి విద్యార్థి, తరగతి ఉపాధ్యాయుడి సంతకం చేయాల్సి ఉంటుంది. పాఠశాల ప్రారంభం నుంచి చివరి పని దినం, సెలవుల వివరాలు ఇలా ప్రతీరోజు నమోదు చేయాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలు ఎఫ్‌ఎ, ఎస్‌ఏలు, ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలు, ఉపాధ్యాయులు పోషకులకు చేసే సూచనలు రాసేందుకు వీలుగా నోట్ టు ద పేరెంట్ కాలమ్ కూడా ఇందులో ఉంది.


