జనగామ: పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్వహణ బాధ్యత మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుందని ఆర్‌అండ్‌బీ జాతీయ రహదారుల విభాగం అధికారులు స్పష్టం చేశారు. ‘వారధి రోదన’ శీర్షికన సాక్షిలో సెప్టెంబర్ 21న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జాతీయ రహదారి 365బీలోని జనగామ–దుద్దెడ సెక్షన్ బైపాస్ మార్గంలో ఈ ఆర్‌ఓబీ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ, ఈ వంతెన జనగామ మున్సిపల్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అందువల్ల ఆర్‌ఓబీ నిర్వహణ పనులను మున్సిపల్ శాఖ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పారామెడికల్ కోర్సుల్లో
ప్రవేశాలకు నోటిఫికేషన్
జనగామ: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పారా మెడికల్ బోర్డు సెక్రటరీ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగమణి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల వ్యవధి కలిగిన రెండు పారా మెడికల్ డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిప్లొ మా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (డీఎంఐటీ) కోర్సులో 30 సీట్లు, డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ డీఏఓ కోర్సులో 30 సీట్లు కేటాయించారు. రెండు కోర్సుల్లో కలిపి మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్ ఉత్తీర్ణులకు అవకాశం
ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో ఇతర ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల దరఖాస్తులను కూడా పరి శీలించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ లోగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశా ల కార్యాలయంలో అందజేయాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 15 నుంచి తెలంగాణ పారామెడికల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgpmbtelangana.gov.in లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు కోచ్‌గా తిరుపతి
జనగామ రూరల్: చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 23 నుంచి జరుగుతున్న 41వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తెలంగాణ టీమ్‌కు కోచ్‌గా నర్మెట మండలం బొత్తల్లపర్రెకు చెందిన వాంకుడోత్ తిరుపతి ఎంపికయ్యారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన ఎంపికకు సహకరించిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, ప్రధాన కార్యదర్శి సారంగపాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్ అభినందనలు తెలిపారు.
నేడు పాఠశాలలు
పునఃప్రారంభం
జనగామ రూరల్: ఈనెల 23న (శుక్రవారం) విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈనెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
నేడు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ హాస్టల్‌నుంచి కెనాల్ సమీపంలోని కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల వరకు రూ.1.34 కోట్ల వ్యయంతో కిలోమీటర్ మేర చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా పరీక్షల విభాగం పక్కనే రూ1.67 కోట్ల వ్యయంతో పరీక్షల విభా గం రెండో బ్లాక్ భవనం నిర్మించారు. ఈ రెండు అభివృద్ధి పనులను ఈనెల 23న (శుక్రవారం) కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. అభివృద్ధి అధికారి ఆచార్య వై.వెంకయ్యతో కలిసి ప్రారంభించనున్నారు.


