ధాన్యం అధరహో | - | Sakshi
Sakshi News home page

ధాన్యం అధరహో

Oct 23 2026 12:57 AM | Updated on Oct 23 2026 12:57 AM

జనగామ: ఐదు రోజుల సెలవుల అనంతరం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ గురువారం తిరిగి ప్రారంభమైంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీగా ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో మార్కెట్‌కు ధాన్యం రాక పెరిగింది. దొడ్డు ధాన్యంతో పాటు సన్నధాన్యానికి కూడా కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా సన్నధాన్యానికి డిమాండ్‌ పెరగడంతో క్వింటాల్‌కు రూ.3,000 వరకు ధర పలుకుతుండటం రైతుల్లో ఆనందం నింపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఏ–గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకం ధాన్యానికి రూ.2,441, మొక్కజొన్నకు రూ.2,410 ధర ఉంది. అయితే జనగామ మార్కెట్‌లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యానికి నాణ్యతను బట్టి ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2,400 వరకు ధర చెల్లిస్తున్నారు. సన్నధాన్యానికి మాత్రం రూ.2,800 నుంచి రూ.3,000 వరకు ధర లభిస్తోంది.

దొడ్డు ధాన్యం 7,466 క్వింటాళ్ల కొనుగోలు

7,466 క్వింటాళ్ల దొడ్డు ధాన్యం, 234 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని కొనుగోలు చేశారు. దొడ్డు ధాన్యాని కి క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,809, గరిష్టంగా రూ.2,369, మోడల్‌ ధర రూ.2,339 పలికింది. సన్నధాన్యానికి కనిష్ట ధర రూ.2,799, గరిష్ట ధర రూ.3,001, మోడల్‌ రూ.2,799గా నమోదైంది.

జిల్లా మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

సన్నాలకు రూ.3,000 ధర

ఐదు రోజుల సెలవుల తర్వాత

ప్రారంభమైన కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement