సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

● పూల మార్కెట్లు, వ్యాపారాలు కళకళ

● బతుకమ్మకుంటలో ఏర్పాట్లు పూర్తి

● పోలీసుల పటిష్ట బందోబస్తు

జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగకు జిల్లాకేంద్రంతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో సర్వం సిద్ధమైంది. నేడు (ఆదివారం) సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంటతో పాటు వివిధ ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొననున్నారు. మరోవైపు పండుగను పురస్కరించుకొని పట్టణంలో పూల మార్కెట్లు, వస్త్ర, బంగారు ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు చేరుకుంటున్న వారితో బస్టాండ్లు రద్దీగా మారాయి.

పూలకు డిమాండ్‌..

జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటతో పాటు పాత బీటు బజారు, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణ, తది తర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పండుగ వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మున్సిపల్‌ అధికారులు ఫ్లైఓవర్‌, ఆర్టీసీ చౌరస్తా, బతుకమ్మకుంట తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. కాగా పండుగకు అవసరమైన పూల కొనుగోళ్లతో జనగామ మార్కెట్లు సందడిగా మారాయి. కిలో బంతిపూలు రూ.80 చొప్పున విక్రయించగా, గులా బీలు, చామంతి పూలదండలకు డిమాండ్‌ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. పండుగకు సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు హైదరాబాద్‌తో పా టు హనుమకొండ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న జనగామ వాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు జిల్లాలోని పలు బస్టాండ్లు, బస్‌ స్టాప్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

పోలీసుల నిఘా.. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. డీసీపీ రా జామహేంద్ర నాయక్‌ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సి బ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement