● కాంగ్రెస్–బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
● గొడవతో ముందుగానే ముగిసిన వేడుకలు
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణు ల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా వేడుకలకు హాజరయ్యారు. ఇటీవల చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి సైతం వేడుకలకు వచ్చారు. గంట పాటు వేడుకలను తిలకించిన అనంతరం ప్రశాంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రొటోకాల్ లేని వ్యక్తులు అధికారిక వేదికపైకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి స్పందిస్తూ మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు మినహా ఇతరులు వేదికపైకి వెళ్లకుండా చూడాలని పోలీసులకు సూచించారు. ఆ తర్వాత ముఖ్య అతిథులు బహుమతుల కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో నూ ప్రశాంత్‌రెడ్డి మరోసారి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరి గింది. పరస్పర వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొడవ మరింత ముదిరే అవకా శం ఉండటంతో రాత్రి 9.30 గంటల సమయంలో అధికారులు వేడుకలు ముగిశాయని, అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రకటించారు. కాగా, బీఆర్‌ఎస్ నాయకురాలు ప్రేమలతారెడ్డి మాట్లాడుతూ..బతుకమ్మ వేడుకల్లో గొడవలు చేయడం అవమానకరమని, మహిళల పండుగలో రాజకీయ వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. చేర్యాల ఏఎంసీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఆహ్వానం మేరకే తా ను సద్దుల బతుకమ్మ వేడుకలకు వచ్చానని, వేదికపైకి వెళ్లి మహిళలకు శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


