ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

● విజయ డెయిరీ జిల్లా మేనేజర్‌ నరేష్‌

బచ్చన్నపేట: పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే విజయ డెయిరీ ధ్యేయమని జిల్లా మేనేజర్‌ డాక్టర్‌ నరేష్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలో విజయ డెయిరీ రైతులు 147 మందికి రూ. 5వేల చొప్పున దసరా కానుకగా బోనస్‌ డబ్బులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు అనుకూలంగా ధరలను అందిస్తూ వారి సేవలను వినియోగించుకుంటుందన్నారు. రైతులు వ్యవసాయం చేస్తే ఆరు నెలలకు ఒకసారి ఆదాయం వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఒకసారి జీతం వస్తుందని, కానీ పాడి రైతులకు 15 రోజులకు ఒకసారి ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ చైర్మన్‌ బొమ్మెన అంజనేయులు, సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతులు ఎనుగుల ఆగయ్య, కనుకయ్య, బండారి రాములు, పడిగల సత్తిరెడ్డి, నర్ర కర్ణాకర్‌రెడ్డి, చిట్టి చెంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement