న్యూస్‌రీల్
కప్పు టీ తాగితే కానీ మొదలుకాని రోజు
కప్పుకో ధర.. పెరిగిన రేట్లు
– IIలోu
బతుకమ్మలతో ఉద్యమం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మహిళలు బతుకమ్మలు చేతపట్టి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు అన్నారు.
గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
జనగామ: ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం అలసట తీర్చుకునే వరకు సామాన్యుడి జీవితంలో చాయ్ ఓ భాగమైపోయింది. పనికి వెళ్లే ముందు, మధ్యాహ్నం విరామ సమయంలో, స్నేహితులతో ముచ్చటించేటప్పుడు కప్పు టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే నిన్నటి వరకు రూ.10తో సరిపోయే చాయ్ ధర ఇప్పుడు రూ.12 నుంచి రూ.15కు చేరింది. లీటరు పాలు, అల్లం చాయ్, కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ ధరలూ పెరగడంతో చాయ్ ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ అదనపు ఖర్చు మరో భారంగా మారుతోంది. చిన్న మొత్తమే కదా అని పట్టించుకోకపోయినా, నెలాఖరుకు లెక్కలు వేసుకుంటే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది.
ముడిసరుకుల ధరల పెరుగుదల
చాయ్ తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం హోటళ్ల యజమానులకు భారంగా మారింది. కిలో చక్కెర ధర రూ.46 నుంచి రూ.60కు పెరగగా, టీ పొడి ధర రూ.350 నుంచి రూ.400కు చేరింది. కిలో అల్లం ధర రూ.70 నుంచి రూ.120కు పెరిగింది. వీటితో పాటు పాలు, గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇక కాఫీ, బూస్ట్ వంటి ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
నెలకు రూ.600కు పైగా అదనపు భారం
రోజుకు నాలుగు నుంచి ఆరు కప్పుల వరకు చాయ్ తాగే వారు చాలామందే ఉన్నారు. మరికొందరు కాఫీ, అల్లం చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ వంటి పానీయాలను ఇష్టపడుతుంటారు. ఒక్కో కప్పుపై సగటున రూ.2 నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి వస్తే రోజువారీ ఖర్చు పెరుగుతుంది. రోజుకు యావరేజ్‌గా రూ.20 అదనంగా ఖర్చ పెరిగితే నెలకు రూ.600 భారం పడుతుంది.
చాయ్ తాగుతున్న ప్రజలు
చాయ్ తయారీ చేస్తున్న కార్మికుడు
సింగిల్ టీ రూ.10 నుంచి రూ.15 వరకు పెంపు
రోజుకో చాయ్ బడ్జెట్.. నెలకు రూ.450 నుంచి 600
పెరిగిన చక్కెర, అల్లం, పాలు, టీ పొడి ధరలు
జిల్లాలో చిన్నచిన్న టీ పాయింట్లలో గతంలో రూ.10 ఉన్న సాధారణ చాయ్ ధర ప్రస్తుతం రూ.12కు చేరగా, పెద్ద హోటళ్లలో రూ.15 వసూలు చేస్తున్నారు. అల్లం చాయ్ ధర రూ.15 నుంచి రూ.20కు పెరిగింది. పెద్ద హోటళ్లలో కాఫీ ధర రూ.20 నుంచి రూ.30కు చేరగా, గ్రీన్ టీ రూ.25 నుంచి రూ.30కి, లెమన్ టీ రూ.20 నుంచి రూ.25 కు పెరిగింది. కొన్ని చోట్ల ఒక్కో కప్పుపై రూ.2 నుంచి రూ.10 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే రహదారుల వెంట టీ డబ్బాలు నిర్వహించే కొందరు వ్యాపారులు మాత్రం ఇప్పటికీ సాధా రణ చాయ్‌ను రూ.10కే విక్రయిస్తున్నారు.


