వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

‘సూపర్‌’లోకి సీకేఎం

ప్రసూతి, నేత్ర వైద్యశాలలు?

శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

● లాభసాటి వ్యాపార రంగాలపై దృష్టి సారించాలి

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

‘మిషన్‌ వాత్సల్య’ పోస్టుల రాతపరీక్ష ప్రశాంతం

జనగామ రూరల్‌: జిల్లాలో మిషన్‌ వాత్సల్య కింద చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098లో, మిషన్‌ శక్తి కింద మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 14 పోస్టులను భర్తీచేసేందుకు గురువారం కలెక్టరేట్‌లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. 14 పోస్టులకు 112 మంది దరఖాస్తు చేసుకోగా 98మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ పరీక్ష నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కుల సాధనకు ‘చలో హైదరాబాద్‌’

జనగామ: మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహించనున్న మహా ధర్నాలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మిద్దపాక రాజు ఆధ్వర్యంలో గురువారం కార్మికులు హైదరాబాద్‌ బయలుదేరారు. సీడీఎంఏ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిద్దపాక రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్‌ 1181ను వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్‌ నంబర్‌ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పబ్లిక్‌ హెల్త్‌, నాన్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్ల విధానా న్ని రద్దు చేసి, ప్లంబర్‌, ఫిట్టర్‌, డ్రైవర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, బిల్‌ కలెక్టర్లుగా కార్మికులను కొనసాగించాలని పేర్కొన్నారు.

ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

జనగామ: పట్టణంలో ఫ్లెక్సీలు, లాలీపాప్‌ల ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత రుసుములు చెల్లించి, నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు వెంటనే అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. గడువులోగా అనుమతులు పొందని ఫ్లెక్సీలను తొలగిస్తామని హెచ్చరించారు. సంస్థలు, వ్యక్తులు ఫ్లెక్సీలు, లాలీపాప్‌లు ఏర్పాటు చేయడానికి ముందుగా సంబంధిత వార్డు ఆఫీసర్‌ వద్ద లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కమర్షియల్‌ ఫ్లెక్సీలకు వారానికి రూ.1,000, నాన్‌ కమర్షియల్‌ ఫ్లెక్సీలకు రూ.500 రుసుము, కమర్షియల్‌ లాలీపాప్‌లకు వారానికి రూ.200, నాన్‌ కమర్షియల్‌ లాలీపాప్‌లకు రూ.100 చెల్లించాలన్నారు. పట్టణ పరిశుభ్రత, సుందరీకరణ, ప్రజ ల భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

జనగామ: పట్టణంలో జరుగుతున్న శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఐదో రోజు దుర్గా దేవీ అమ్మవారు లలితా త్రిపుర సుందరి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మండపాల్లో ప్రత్యేక పూజలకు భక్తులు భారీగా హాజరయ్యారు.

కాశిబుగ్గ: వరంగల్‌లో పెద్దఎత్తున నిర్మాణం చేపట్టిన 24 అంతస్తుల సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓపీ సేవలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. దసరా పర్వదినాన ఆస్పత్రి ప్రారంభో త్సవంతోపాటు ఓపీసేవలు ఆరంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం వరంగల్‌లో ప్రకటించారు. చాలాకాలంనుంచి ఎదురుచూస్తున్న ముహూర్తానికి ఇక ఐదు రోజులే మిగి లాయి. మరోవైపు ఓపీ సేవలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుండడంతో ఆస్పత్రిలో సేవలు సూపర్‌గా ఉండేందుకు అధికారులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో డీఎంఈ డాక్టర్‌ వాణి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పర్యవేక్షణలో నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ, గ్రూప్‌–1 అధికారులు, ముగ్గురు నోడల్‌ అధికారులు ఫ్లోర్‌కు ఒకరు చొప్పు న బాధ్యతలు తీసుకుని విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు నిర్మాణ పనులు సాగుతున్నాయి.

తొలుత గ్రౌండ్‌, మొదటి అంతస్తులో ఓపీ సేవలు

ప్రస్తుత నిర్మాణ పనుల దృష్ట్యా తొలుత ఓపీ సేవలను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన పనులు పూర్తి చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తులో ఓపీ సేవలు, పలు రకాల పరీక్షలు అందించేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా ఫర్నిచర్‌, ఓపీ హాల్‌లో భారీ ఫ్యాన్లను సైతం సిద్ధం చేశారు. వైద్యులను అందుబాటులో ఉంచుతూ, వివిధ రకాల పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందిని అలర్ట్‌ చేశారు. దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్లవారీగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఏ రోజు ప్రారంభమైనా విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌ సిబ్బంది విధులపై స్పష్టత రావడంతో వారికి రోస్టర్‌ కూడా తయారు చేశారు. పనిలో పనిగా గురువారంనుంచి నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, డ్రెస్సింగ్‌ సిబ్బందిని ట్రయల్‌ రన్‌గా విధులకు పంపించారు. వీరిని మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క స్వయంగా చూసి, పేషెంట్లకు వైద్యసేవలు ఎలా అందిస్తారో అడిగి తెలుసుకున్నారు.

కార్పొరేట్‌ స్థాయిలో అధునాతన ఏర్పాట్లు..

దసరా కానుకగా పేదలకు అందిస్తున్న ఓపీ సేవలు కార్పొరేట్‌ స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పేషెంట్లు కూర్చొనేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రుల మాదిరిగా కుర్చీలను సిద్ధం చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ఓపీ గదులు కేటాయించారు. ఇందులో వైద్యులు ఓపీ చూసేందుకు కార్పొరేట్‌ స్థాయిలో వసతులు ఉన్నాయి. వివిధ పరీక్షల్లో భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఈసీజీ, ఈఈజీ, డ్రెస్సింగ్‌ రూంలు సిద్ధంగా ఉంచారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఓపీ గది కేటాయించారు. మొత్తంగా 50 వరకు భారీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అధునాతన ఫ్యా న్లు, ఆస్పత్రి లోపల మొత్తం కళ్లు జిగేల్‌ అనే విధంగా విద్యుత్‌ లైట్లను అమర్చారు. ఏర్పాట్లు భారీగా ఉన్నా.. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఏ మేరకు వైద్యసేవలు అందుతాయో వేచి చూడాల్సిందే.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

వ్యవసాయంలో మహిళలది కీలకపాత్ర

జనగామ రూరల్‌: ఆహార శుద్ధి పరిశ్రమలు, రవాణా వంటి లాభసాటి వ్యాపార రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మహిళా కిసాన్‌ దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 170 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా రైస్‌ మిల్లుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి, మహిళలు ఈ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల ప్రగతిశీల మహిళలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, డీఏఓ అంబికా సోనీ, ఏపీడీ నూరుద్దీన్‌, ఏడీఏ అపర్ణ, డీపీఎం నళిని, కృషి కేంద్రాల సఖీలు, రైతు సేవా కేంద్రాల మహిళలు పాల్గొన్నారు.

నాలుగు నెలల్లో రూ.40 లక్షల టర్నోవర్‌

జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయాన్ని సాధించవచ్చని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన రాధిక నిరూపిస్తున్నారు. మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహణ ద్వారా నాలుగు నెలల్లోనే రూ.40 లక్షల టర్నోవర్‌ సాధించగా కలెక్టర్‌ అమెను అభినందించారు. అలాగే కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన ప్రియాంక మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేస్తున్నారు. కేంద్రాన్ని ప్రారంభించిన కేవలం నాలుగు నెలల్లోనే రూ.20 లక్షల టర్నోవర్‌ సాధించడం విశేషం.

కమిషనరేట్‌లో

‘బతుకమ్మ’ సందడి

హసన్‌పర్తి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల నుంచి పైస్థాయి ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సీపీ శ్వేత, డీసీపీ దార కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ విఽధి నిర్వహణలో నిమగ్నమయ్యే సిబ్బంది ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.

కార్పొరేట్‌ స్థాయిలో

రూపుదిద్దుకుంటున్న దవాఖాన

అధునాతన ఫ్యాన్లు, 50 వరకు లిఫ్ట్‌లు

ఎంజీఎంలో అడ్మిట్‌ అయ్యే

పేషెంట్లకు ఏర్పాట్లు ఏవీ?

పేషెంట్లు అడ్మిట్‌ అయితే ఎలా?

అవుట్‌ పేషెంట్లుగా వచ్చిన వాళ్లు పరీక్షలు చేసిన తర్వాత అడ్మిట్‌ ఎలా చేయాలన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కేవలం ఓపీ సేవలు ఉండడంతో వారిని సూపర్‌ నుంచి ఎంజీఎంకు ఎలా తరలిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అదేవిధంగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ పరీక్షలు అవసరమైతే పేషెంట్లు అక్కడికి వెళ్లడం కష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓపీ సేవలు ప్రారంభమైన తర్వాత ఏం చేయాలో చేస్తామంటూ దాటవేస్తున్నారు. దవాఖానాలో ఉన్న అంబులెన్స్‌లు వాడుతారా.. లేక ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement