నర్మెట: గ్రామాల అభివృద్ధిలో అధికారులు, సర్పంచ్‌లు భాగస్వాములు కావాలని అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రిసూరి అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో అయన మాట్లాడారు.. స్వచ్ఛ భారత్ నిధులను సద్వినియోగం చేసి వ్యక్తిగత, సాధారణ, సామాజిక, వీఓ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మురుగు కాల్వల చివరన సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి నిలువ (చిన్న) గుంతల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ హౌసింగ్ భజరంగ్‌లాల్, తహసీల్దార్ కలకుంట్ల రామానుజాచార్యులు, ఎంఓ డా.సుకన్య, ఏపీఓ బిరుకూరి రమాదేవి, ఏఓ బుర్రా మమత, ఏఈలు ప్రజ్వల్, శ్రీనివాస్, సోహెల్, సోమేత్ర శుక్లా, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


