నర్మెట: విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, అంతరాయాలు లేకుండా తీర్చిదిద్దే దిశగా జనగామ పరిధిలోని హన్మంతాపురం–మేకలగట్టు సబ్‌స్టేషన్ల మధ్య 3.5కి.మీ 33 కేవీ లింక్‌లైన్‌ను గురువారం విజయవంతంగా చార్జ్ చేశామని ఎస్‌ఈ చెరుకు సంపత్ రెడ్డి తెలిపారు. నర్మెట సబ్‌స్టేషన్‌లో అంతరాయాలు ఏర్పడినపుడు రఘునాథపల్లి నుంచి హన్మంతాపూర్‌కు విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం కలుగుతుందని, నర్మెట సబ్‌స్టేషన్ నుంచి రఘునాథపల్లి, మండలగూడెం, ఖిలాషపూర్ సబ్‌స్టేషన్లకు కూడా అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా విస్తరించే అవకాశం ఏర్పడిందన్నారు. డీఈ విజయ్‌కుమార్, ఏడీఈలు స్వామి రెడ్డి, సుధాకర్, ఏఈ రామ్ పాల్గొన్నారు.


