మూడు గ్రామాలకు కలిపి ఒక రైతు వేదిక ఉంది. మరిగడికి చౌడారంలో ఉండగా రైతులు వెళ్లడం లేదు. తాగునీరు, కరెంట్, అవగాహన కల్పించడానికి నెట్ టీవీలు లేవు. రైతు వేదికల్లో సౌకర్యాలు కల్పించి రైతులకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
–కాసాని మల్లేష్, రైతు మరిగడి
గత ప్రభుత్వం రైతుల కోసం కట్టిన రైతు వేదికలు నిర్వహణలో లేవు. అక్కడి పోయేది లేదు చెప్పేది లేదు. అధికారులు తండాకు వచ్చి పోతారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నా అందరికీ తెలియదు. నిరుపయోగంగా ఉన్న రైతు వేదికలను వాడుకలోకి తేవాలి.
–భూక్య మోతీలాల్, రైతు, పెద్ద తండా(ఎం)


