సాగునీటికి మొదటి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

Aug 27 2025 8:26 AM | Updated on Aug 27 2025 8:26 AM

సాగున

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

– 11లోu

న్యూస్‌రీల్‌

– 10లోu

బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025

రఘునాథపల్లి: బ్యాంక్‌ స్ట్రీట్‌లో భారీ వినాయక మండపం

నవరాత్రి ఉత్సవాలకు వినాయకుడిని తీసుకువెళ్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు

బీసీ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు

జనగామ: జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ఎన్‌.లక్ష్మినర్సింహరావు మంగళవారం బాధ్యలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఎఫ్‌ఏసీగా పని చేస్తున్న రవీందర్‌ నుంచి బాధ్యతలను తీసుకున్న తర్వాత కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

జనగామ రూరల్‌: న్యాయవాదుల భద్రత, రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలు (ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌) జిల్లా కన్వీనర్‌ గాజుల రవీందర్‌ అన్నారు. కూకట్‌పల్లి కోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది తన్నీరు శ్రీకాంత్‌పై దాడికి నిరసనగా మంగళవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్‌ మహేశ్వరం బద్రీనాథ్‌, వట్టేపు వినయ్‌ కుమార్‌, అమృత రావు, బిట్ల గణేష్‌, ఎ. లక్ష్మణ స్వామి, గుగులోత్‌ శ్రీనివాస్‌, మోతే సంపత్‌, బాలబోయిన సంపత్‌, చాగంటి శ్రీనివాస్‌, బస్కుల ఠాగూర్‌, కాముని శ్రావణ్‌ కుమార్‌, పోగుల కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

చిల్పూరు: జిల్లాలో యూరియా కొరత లేదని, అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొతర సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి అంబికసోని అన్నారు. మండలంలోని మంగళవారం మండల వ్యవసాయాధికారి నజీరుద్దిన్‌తో కలిసి పలు ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని, ఎక్కడైన యూరియా వచ్చిందనగానే రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో దొరకడంలేదన్నారు. సొసైటీల వారీగా యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏఈఓలు వినయ్‌కుమార్‌, నర్సింహులు, యాకూబ్‌ తదితరులు ఉన్నారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలి

జనగామ రూరల్‌: పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు తోట హృతిక్‌సాయి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరస న కార్యక్రమంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్‌ తీసుకో లేక, కొత్త అడ్మిషన్‌ పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నాఉ. భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేసే పరి స్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి దేశగాని సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివార్ల మహేందర్‌, వట్టిపల్లి గణేష్‌, దేవులపల్లి నితీష్‌, సాగర్‌, అక్షిత్‌ పాల్గొన్నారు.

రేపు ఉచిత

ఉపకరణాల శిబిరం

జనగామ రూరల్‌: జిల్లాలో దివ్యాంగులకు రేపు (గురువారం) అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకరణాల క్యాంపు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు ఈ నెల 28న ప్రెస్టన్‌ హైస్కూల్‌లో ఉదయం 10 నుంచి ఐదు గంటల వరకు శిబి రం ఉంటుందన్నారు. ఆధార్‌, రేషన్‌, సదరం సర్టిఫికెట్‌ జిరాక్స్‌తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్‌ నాగరాజు (9491533047)ను సంప్రదించాలన్నారు.

సందడి షురూ

జిల్లాలో పండుగ హోరు

మార్కెట్‌లో రద్దీ, లడ్డూలకు గిరాకీ

మండపాలు సిద్ధం చేసిన నిర్వాహకులు

నేడు వినాయక చవితి

జనగామ: జనగామలో వినాయక చవితి పండుగ సందడి మొదలైయింది. ఆధ్యాత్మికత, భక్తి, ఉత్సాహం, వ్యాపారం అన్నీ కలిసిపోయి గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ప్రకృతిని ఆరాధించడం, పంచభూతాలను పూజించడం భారతీయ సంస్కృతి గొప్పతనం. వినాయక చవితి పండుగను పురస్కరించకుని గణపయ్యను 21 రకాల పత్రులతో పూజించడంలో శాసీ్త్రయమైన భావన ఉంది. ఈ పత్రాలు నీటిలో కలిసినప్పుడు ఔషధ గుణాలు వ్యాపించి వాగులు, చెరువులను శుభ్రం చేస్తాయని విశ్వాసం. పత్రి పూజ ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని పండుగ మనకందించే సందేశం. నేడు (బుధవారం) వినాయక చవితి పండుగ నేపధ్యంలో సాక్షి ప్రత్యేక కథనం.

మండపాలకు విగ్రహాల తరలింపు..

పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు తయారీ చేసిన వినాయకుడి ప్రతిమల విక్రయాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రతిమలను కొనుగోలు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, ఇతర వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. అలాగే పూలదండలు, పండ్లు, పత్రులు, పూజా సామగ్రి కోసం కొనుగోలుదారులు బారులుదీరారు. గ్రామాల నుంచి ప్రత్యేకంగా మామిడి కొమ్మలు, సీతాఫల్‌, జామ, దానిమ్మ, పత్రులు, పండ్లు పెద్ద ఎత్తున మార్కెట్‌కు చేరాయి. మార్కెట్‌లో రద్దీ నెలకొంది.

కిక్కిరిసిన బస్టాండ్‌

పండుగ రాకతో జనగామ ఆర్టీసీ బస్టాండ్‌ జనసందోహంతో నిండిపోయింది. ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకోవడంతో బస్టాండు కిక్కిరిసిపోయింది.

విద్యావ్యవస్థను మరింత పటిష్టపరచాలి

జనగామ రూరల్‌: విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశహాల్‌లో విద్యావ్యవస్థ పటిష్టతపై అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన హెచ్‌ఎంలకు ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. సమావేశంలో విద్యాశాఖ అధికారులు చంద్రభాను, రవికుమార్‌, సత్యమూర్తి, శ్రీనివాస్‌, గౌసియా బేగం, రామరాజు, నాగరాజు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్‌ కార్డు వాల్‌ పోస్టర్లను అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావుతో కలిసి విడుదల చేశారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం నమోదుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

పోస్టు మాస్టర్లకు పింఛన్‌ కిట్ల పంపిణీ

జనగామ: జిల్లాలో ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్లకు కొత్త మొబైల్‌ ఫోన్లు, ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌లతో పాటు సాంకేతిక పరికరాలకు సంబంధించి కిట్లను అందించినట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ చేతుల మీదుగా 167 కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దీన్‌, డీపీఎం సతీష్‌, గిరిబాబు, పోస్టల్‌ శాఖ ఏఎస్‌పీ కృష్ణ, నవీన్‌, భాస్కర్‌, పోస్ట్‌ మాస్టర్లు పాల్గొన్నారు.

శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి

జనగామ: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డులతో పాటు హైదరాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట రహదారులను పరిశీలించారు. 17వ వార్డులోని మోడల్‌ మార్కెట్‌, 15 వార్డులో స్లాటర్‌ హౌస్‌, 15, 17, 20, 21, 27, 29, 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గోపయ్య, పులిశేఖర్‌, జవాన్లు లక్ష్మణ్‌, ఎల్లేష్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.

తప్పని నిరీక్షణ

జిల్లాలో పెద్దగా యూరియా కొరత లేకున్నా.. పలు మండలాల పరిధిలో నిరీక్షణ తప్పడం లేదు. మంగళవారం కొడకండ్ల, నర్మెట, పాలకుర్తి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథపల్లి మండలాల్లో ఆగ్రోస్‌, పీఏసీఎస్‌, ప్రైవేటు ఫర్టిలైజర్‌ దుకాణాల వద్ద రైతులు తెల్లవారు జాము నుంచే యూరియా కోసం బారులుదీరారు.

– జనగామ/సాక్షి నెట్‌వర్క్‌

భక్తితో పూజిద్దాం.. భద్రతతో నిఘా ఉంచుదాం..

మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలకు చెక్‌

నిర్వాహకులు, ఎలక్ట్రీషియన్లకు విద్యుత్‌ శాఖ సూచనలు

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

లింగాలఘణపురం: సాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రా మాల్లో పనుల జాతరలో భాగంగా రూ.2.30కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్లలో విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌ నుంచి నవాబుపేట రిజర్వాయర్‌కు వచ్చే ప్రధాన కాల్వకు రూ.150 కోట్ల లైనింగ్‌ పనులను మంజూరు చేయించానన్నారు. రిజర్వాయర్‌ పనులన్నీ ఏడాదిలో పూర్తి చేయించి నియోజకవర్గంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపి స స్యశ్యామలం చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, ఆర్డీఓ గోపీరామ్‌, డీఈ ఆర్‌.రవీందర్‌, ఎంపీడీఓ రఘురామకృష్ణ, తహసీ ల్దార్‌ రవీందర్‌, ఏఈ శ్రీనివాసు, శివకుమార్‌, గుడి వంశీధర్‌రెడ్డి, మోహన్‌, శ్రీలతారెడ్డి, బాబు, దిలీ ప్‌రెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

భద్రతా ఏర్పాట్లు

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్రనాయక్‌ నేతృత్వంలో ఏసీపీ, సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని మొహరించారు. ఆధ్యాత్మికత, భక్తి ఆరాధనతో నిండిన వినాయక చవితి వేడుకలు జిల్లాలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కాగా వారం రోజులపాటు కనుమరుగైన వరణుడు ముసురు రూపంలో ప్రత్యక్షం కావడంతో చిరు వ్యాపారులు ముసురులోనే అమ్మకాలు జరిపారు.

మహాగణపతి.. గోమయ గణపతి

జిల్లాలో వచ్చే నెల (సెప్టెంబర్‌) 6వ తేదీన వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా గణేష్‌ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాణాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, సిద్ధాంతి కృష్ణ మాచార్యులు ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ నాయకులు రంగ నర్సింగరావు, కీర్తి నరసయ్య తదితరులు ఉన్నారు.

లడ్డూలకు గిరాకీ

వినాయకుడి చేతిలో లడ్డూ పెట్టడం సంప్రదాయం. ఈసారి కూడా అర కిలో లడ్డూ నుంచి 25 కిలోల బరువు ఉన్న లడ్డూల వరకు తయారు చేయడానికి స్వీట్‌ హౌస్‌ల్లో ఆర్డర్లు ఇచ్చారు. పట్టణంలో రాత్రి సమయంలో గణేష్‌ మండపాలు విద్యుత్‌ వెలుగుల అలంకరణలతో మెరిసిపోతున్నాయి.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

సాగునీటికి మొదటి ప్రాధాన్యం1
1/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం2
2/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం3
3/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం4
4/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం5
5/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం6
6/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం7
7/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం8
8/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం9
9/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం10
10/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

సాగునీటికి మొదటి ప్రాధాన్యం11
11/11

సాగునీటికి మొదటి ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement