
అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా బెన్షాలోమ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఓపీఎస్ అమలు చేయాలి
జనగామ రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్‌గౌడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మగౌర సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టిన ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, ఉపాధ్యక్షులు మంగ నర్సింహులు, భిక్షం, చింతల రజిత, రామారావు, స్రవంతి, శేఖర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతోనే
అభివృద్ధి సాధ్యం
నర్మెట: ఉపాధి సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధిలో పురోగతి సాధిస్తామని అదనపు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఎంపీడీఓ బోడపాడి అరవింద్ చౌదరి అధ్యక్షతన 16వ సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ మెటీరియల్, లేబర్ కాంపోనెంట్, మస్టర్ల నిర్వాహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యదర్శులు సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. పనుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో పారదర్శకత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఎం అంజి గౌడ్, ఎస్‌ఆర్పీ నరేందర్, క్యూ సి రాజవర్ధన్, ఏఈ ప్రదీప్, ఏపీఓ బిరుకూరి రమాదేవి, పంచాయతీ కార్యదర్శులు కందకట్ల శ్రీధర్, వంశీ, శ్రీకాంత్, ప్రశాంత్, రమేశ్, యాకూబ్, చలపతి, సురేష్, నరేష్ అనిల్, పవన్, సుజాత, కల్యాణ్, రిజ్వాన్, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో యువకుడి ప్రతిభ
రఘునాథపల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన కళ్లెం నవీన్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 20 పురుషుల విభాగం 400 మీటర్ల లాంగ్ జంప్‌లో నవీన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్‌ను గ్రామస్తులు అభినందించారు.
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు డీలర్లకు కమీషన్ రాకపోవడంతో ఇబ్బందులు ప డుతున్నారని, వెంటనే కమీషన్ విడుదల చే యాలన్నారు. కార్యక్రమంలో చెవ్వ శ్రీనివాస్, ఎడ్ల మల్లయ్య, రామగల్ల శ్రీను, దయాకర్, రాజయ్య, దేవస్వామి పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ