జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు
పాలకుర్తి: జాబ్ మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.. మేళా నిర్వహించింది ఎన్నికల స్టంట్ కోసం కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం పాలకుర్తిలో బబ్బూరి శ్రీకాంత్ ఆధ్వర్యాన చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంఎన్‌సీలు సహా 100 కంపెనీలు పాల్గొన్నా యి. పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండలాల నుంచి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, అభినయ్, సహకా ర సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లావు బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఎఫ్‌ఏలు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలిపినట్లు ఎఫ్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పేస్కేల్ ఇవ్వాలన్నారు. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
సిబిల్ స్కోర్ ఉంటేనే
‘రాజీవ్ యువ వికాసం’
బచ్చన్నపేట : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేవారి సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటేనే అర్హులని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. సోమవారం స్థాని క ఎంపీడీఓ కార్యాలయంలో సీబీఐ, టీజీబీవీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరు అప్లికేషన్ ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. వాటిని గ్రామాల వారీగా విభజించి ఏ బ్యాంకు పరిధిలోకి వస్తే వారికి అందజేస్తామ ని, బ్యాంకు అధికారులు సిబిల్ స్కోరు, ఖాతా పూర్వాపరాలను పరిశీలించి అర్హులను గుర్తించి జాబితా ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల ను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గోపీనా యక్, టీజీబీవీ ఫీల్డ్ ఆఫీసర్ అనూష పలువురు పాల్గొన్నారు.
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం..
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారా లు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్‌లోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారా న్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదరపు డీసీపీ రవి తదితరులు పాల్గొన్నారు.
జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు
జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు
జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు


