జనగామ: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుల్లో ఆన్‌లైన్ తప్పిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. వేలల్లో చెల్లించాల్సిన ఫీజును కోట్లలో చూపిస్తుండంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో శ్రీనివాస్‌కు చెందిన 200 గజాల స్థలానికి రూ.14కోట్ల మేర ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చూపించిన షాక్ మరువక ముందే... మరొకటి పునరావృతమైంది. జనగామకు చెందిన తుప్పతి నర్సింహ కొనుగోలు చేసిన 132.86 చదరపు గజాల స్థలాన్ని (రూ.2లక్షలు) రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ అప్లయ్ చేశాడు. ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగా రూ.1,11,92,567 చూపించడంతో శ్రీనివాస్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయమై స్థానిక మాజీ కౌన్సిలర్ జూకంటి లక్ష్మీశ్రీశైలం దృష్టికి తీసుకు వెళ్లగా.. ఆమె మున్సిప ల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే తప్పిదా న్ని సరిచేిసి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎల్‌ఆర్‌ఎస్ తప్పిదంతో ఆందోళన