
నారు పోసి సిద్ధంగా ఉన్నం..
వేసవిలోనే దుక్కులు దున్ని పొలం సిద్ధం చేసుకున్న. వర్షం కోసం ఎదురు చూస్తున్న. గత ఏడాది 5 ఎరకాల్లో వరి, పత్తి సాగు చేస్తే సరిగ్గా ఇదే సమయానికి వరి దున్నకాలు పూర్తి చేశాం. ఈఏడాది కూడా అలాగే ఉంటుందని అన్నీ సమకూర్చుకున్న. మృగశిర కార్తె పోయి అదను దాటుతున్నా వాన లేదు. వర్షాలు పడితే విత్తనాలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముందుగా పెట్టిన పత్తి గింజలు మళ్లీ పెట్టాల్సిన పరిస్థితి ఉంది.
– ఎడ్ల శ్రీనివాస్, రైతు మరిగడి
అధికారుల సూచనలు పాటించాలి
వాతావరణం అనుకూలంగా లేక పోవడం వల్ల వర్షాలు సమయానికి కురవడం లేదు. ఖరీఫ్‌లో జూన్ లోపు.. యాసంగిలో డిసెంబర్ లోపు నారు పోసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారుల సూచనలతో సాగుకు ముందుకెల్లాలి. నారుపోసి సిద్ధంగా ఉండాలి. మంచి వాన పడగానే నాటువేసుకోవచ్చు.
– వినోద్‌కుమార్, డీఏఓ

నారు పోసి సిద్ధంగా ఉన్నం..