
మతసామరస్యానికి ప్రతీక
రఘునాథపల్లి: మండలంలోని గబ్బెటలో ముస్లింకు చెందిన దుదేకుల రంజాన్‌కు అదే గ్రామానికి చెందిన పేరబోయిన సమ్మక్క 15 ఏళ్లుగా రాఖీ కడుతూ అన్నాచెల్లెళ్ల బంధాన్ని పంచుకుంటుంది. సమ్మక్క శనివారం రంజాన్ ఇంటికి చేరుకొని రాఖీ కట్టి అన్నాచెల్లి అప్యాయతను పంచుకుంది. ఈ సందర్భంగా రంజాన్ మాట్లాడుతూ కులమతాలకతీతంగా ఏటా తనకు రాఖీ కడుతున్న సమ్మక్క దేవుడిచ్చిన చెల్లెలు అని పేర్కొన్నారు.
మహిళల
సంక్షేమానికి పెద్దపీట
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం రాఖీపౌర్ణమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలు మహిళల పేరిట అందిస్తున్నామన్నారు.
స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్‌పై శిక్షణ తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు మేఘనరావు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
రామప్పలో హర్‌ఘర్ తిరంగా వేడుకలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శనివారం హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రామప్పకు వచ్చే పర్యాటకులు, భక్తులు, విద్యార్థులు హర్‌ఘర్ తిరంగా నినాదంతో ఉన్న ఫ్లెక్సీలో నిలబడి సెల్పీలు తీసుకున్నారు. ఈ నెల 15న హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనంది.

మతసామరస్యానికి ప్రతీక

మతసామరస్యానికి ప్రతీక