
అరకొర సిబ్బందితో అవస్థలు
లింగాలఘణపురం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతుంది. జిల్లాలో అరకొర సిబ్బందితో ల బ్ధిదారులకు సకాలంలో బిల్లులు రావడం లేదు. మంజూరైన లబ్ధిదారుల ఇళ్లను త్వరగా ప్రారంభించాలని పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓలు, ఏఈలు, డీఈలు వెంటబడి ప్రారంభించారు. దీంతో ఇళ్లను ప్రారంభించి బేస్‌మెట్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి ఒత్తిడి తీవ్రమై మండలంలో హౌసింగ్ ఏఈగా పని చేసిన దివ్య ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాలకు ఏఈగా పని చేసిన ఏఈ రాజీనామా చేయడంతో జనగామ, జనగామ రూరల్ మండల ఏఈ లింగాలఘణపురానికి ఇన్‌చా ర్జ్‌గా కొనసాగుతున్నారు. జిల్లాలో కేవలం ఐదుగు రు ఏఈలు మాత్రమే ఉండగా ఏడు మండలాలకు డీఈ ఒక్కరే ఉన్నారు.
పని ఒత్తిడే కారణమా?
లింగాలఘణపురం మండల ఏఈగా పని చేస్తూ రఘునాథపల్లి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల్లో మహిళ ఉద్యోగిగా తిరగలేక పని ఒత్తిడితో రాజీనామా చేశారా లేక లబ్ధిదారులు బిల్లుల చెల్లింపుపై రోజూ ఫోన్లు చేసి ఒత్తిడి చేయడంతో అనే విషయం తెలియడంలేదు. ఈ విషయమై డీఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఏఈ రాజీనామా చేసిన మాట వాస్తవమేనన్నారు. కాగా ఎవరెవరికి బిల్లులు జమ అయ్యాయనే సమాచారమే కరువైందని, పడని వారు వచ్చి అడిగితే తప్ప తెలియని పరిస్థితి నెలకొంది.
ఒత్తిడి తట్టుకోలేక
ఏఈ ఉద్యోగానికి రాజీనామా?
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో జాప్యం
చెల్లించిన బిల్లులపై అధికారులకు
సమాచారం కరువు