● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: కరాటేతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుందని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో గోజిరాయ్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, నాయకులు దేవేందర్‌రెడ్డి, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయ ఉత్తమ మహిళా రైతుకు సన్మానం
మూడు రోజులు మిషన్ భగీరథ నీరు బంద్
ఇబ్రహీంపట్నం: కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఈనెల 2 నుంచి 4 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు ఈఈ జానకి తెలిపారు. మిషన్ భగీరథ పథకం పైపులైన్ మరమ్మతు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో బోరుబావులను వినియోగించుకుని సహకరించాలని కోరారు.


