శాకాహారమే అద్భుతం.. అమృతం
దేశవిదేశాల్లో మంథని రుచులు
మంథని: సంప్రదాయ వంటలకు పుట్టినిల్లుగా నిలుస్తోంది మంథని. వేదాలు, మేధావులతో పాటు బ్రాహ్మణులు తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటారు. ఏ ప్రాంతంలో చేయని శాకాహార వంటలు కొన్ని మంథని బ్రాహ్మణుల చేతుల్లో తయారవుతాయి. ఇక్కడి ప్రత్యేకమైన గుమ్మడికాయతో చేసే బరడా, చల్లా పులుసు, పాలకూర ఉప్పుడు పిండి, సొజ్జ భక్ష్యాలు ఎంతో ప్రత్యేకం. నాగ్‌పూర్ సిటీ మేయర్ ఇంట్లో వీరు శాకాహార వంటలు చేసి జీవనోపాధి పొందేవారు. వీరి తర్వాత చాలా మంది దేశవిదేశాల్లో మంథని వంట రుచులను పంచుతున్నారు. 1907–85లో మంథనికి చెందిన ముద్దు రాధాక్రిష్టయ్య లండన్‌లో పార్ట్‌టైమ్ వెయిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని వీపీ నరసింహారావు పదవీకాలంలో మంథనికి చెందిన రంగి కిశోర్‌కుమార్(కిట్టు) పర్సనల్ కుక్‌గా పని చేశారు.


