కొండగట్టు అంజన్నకు చందనోత్సవం | - | Sakshi
Sakshi News home page

కొండగట్టు అంజన్నకు చందనోత్సవం

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

● ఈనెల 15 నుంచి 20 వరకు నిర్వహణ ● స్వామివారి నిజరూప దర్శనం ● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి 60ఏళ్ల అనంతరం చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఈనెల 15 నుంచి 20 వరకు చందనోత్సవం, మహా సంప్రోక్షణ ఉంటుందని, డిసెంబర్‌ 29 వరకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామన్నారు. డిసెంబర్‌ 29న స్వామివారికి మండలపూజ, సింధూర లేపనం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఏర్పాట్లు చేయాలి

కార్తీకమాసం సందర్భంగా కొండగట్టుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, నిజరూప దర్శనానికి ని త్యం 50 వేల మంది వచ్చే అవకాశం ఉందని అన్నా రు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, పోలీసు బందో బస్తుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్యూలైన్లు, పార్కింగ్‌ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేసి తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించాలని, వేములవాడ నుంచి జగిత్యాలకు 8 బస్సులను కొండగట్టు మీదుగా నడపాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, కొండగట్టు ఈవో అంజనారెడ్డి, డీపీవో మదన్‌మోహన్‌, డీఎంహెచ్‌వో సుజాత, మిషన్‌ భగీరథ, ఫైర్‌ అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

మహాత్మగాంధీ జ్యోతిబాపూలే విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. బీర్‌పూర్‌, మెట్‌పల్లిలో పీఈటీ, జగిత్యాల బాలుర జూనియర్‌ కళాశాలలో హెల్త్‌ సూపర్‌వైజర్‌, రాజారంలో జూనియర్‌ లెక్చరర్‌ భౌతికశాస్త్రం (మహిళలకు మాత్రమే), గొల్లపల్లి బాలికల పాఠశాల టీజీటీ గణితం (మహిళలకు మాత్రమే) ఖాళీలున్నాయని, ఈనెల మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 91541 02664లో సంప్రదించాలని కోరారు.

ఉచిత నైపుణ్య శిక్షణ ప్రవేశానికి..

గిరిజన, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement