జగిత్యాల: చెత్త నిర్వహణలో ఆధునిక విధానాలు పాటించాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల బల్దియా సమావేశాన్ని చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేద్దామన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా ప్రాసెస్ చేయడం సులవవుతుందన్నారు. ప్రొజెక్టర్ ద్వారా చెత్త నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ ప్రాసెసింగ్‌పై వివరించారు.
పట్టణాభివృద్ధికి కృషి
జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చైర్‌పర్సన్ వాణి అన్నారు. ఎల్‌ఈడీ లైట్లు, హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ నిర్వహణ, జనరేటర్లు, డ్రైనేజీ మరమ్మతు, మోతె చెరువు పార్క్‌లో ఫెన్సింగ్ వంటి అంశాలకు కౌన్సిల్ ఆమోదం లభించిందన్నారు. అనారోగ్యంతో కోమాలో ఉన్న రెండో వార్డు ఆఫీసర్ వైద్య చికిత్సకు సభ్యులు ఒకనెల గౌరవ వేతనాన్ని అందించేందుకు అంగీకరించారు. వైస్ చైర్‌పర్సన్ జీనత్ పర్వీన్, కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే 33వ వార్డుకు చెందిన అఖిలకు సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.1.06 లక్షల విలువైన చెక్కును అందించారు.
ప్రజల సహకారం తప్పనిసరి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


