● దుకాణాలు, హాస్టళ్లలో సోదాలు
తిమ్మాపూర్: కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎల్‌ఎండీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాన్‌షాపులు బాలుర హాస్టళ్లలో నార్కోటిక్స్ డాగ్ సహాయంతో ఎల్‌ఎండీ ఎస్‌ఐ అరుణ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడంతో పాటు, మాదకద్రవ్యాల అక్రమ వినియోగం మరియు సరఫరాను అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎల్‌ఎండీ కాలనీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


