పెగడపల్లి: కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్కు మంచిపేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తొందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డకు స్వల్ప మరమ్మతులు చేసి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీరు తరలించే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి పాజెక్టును తెరపైకి తెచ్చి కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రమణారావు, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్ వీరేశం, నాయకులు ఆనందం, లక్ష్మణ్, రాజశేఖర్, తిరుపతి, అంజి, పద్మ, లక్ష్మీనారాయణ, విజయ్యాదవ్, అరుణ్, రాజమల్లు ఉన్నారు.


