జగిత్యాలరూరల్: విద్యార్థినులు వ్యక్తిగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మట్టా సరిత అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని బాలికల గురుకులంలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. 18ఏళ్ల లోపున్న వారిపై లైంగికదాడులు, వేధింపుల నుంచి పోక్సో చట్టం కాపాడుతుందన్నారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు పాల్పడినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలపాలన్నారు. అనంతరం పోక్సో చట్టం అవగాహన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.చంద్రమోహన్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, న్యాయవాదులు మమత, స్వప్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


