కోరుట్ల ఆర్టీసీ డిపోలో అన్నీ పాత బస్సులే.. | - | Sakshi
Sakshi News home page

కోరుట్ల ఆర్టీసీ డిపోలో అన్నీ పాత బస్సులే..

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

కోరుట్ల: కోరుట్ల ఆర్టీసీ డిపోలో పాత బస్సులే అధికంగా ఉన్నాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను మంగళవారం సందర్శించారు. కండీషన్‌లో ఉన్న బస్సులు నడపాలని డీఎంకు సూచించారు. ప్రయాణికులతో మాట్లాడి బస్టాండ్‌లో సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం పాఠశాలలకు సమయానుకూలంగా బస్సులు నడపాలన్నారు. యాదాద్రి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు వేయాలని సూచించారు.

కేసీఆర్‌ వంటి వ్యక్తి చరిత్రలో ఒక్కరే ఉంటారు

ఇబ్రహీంపట్నం: కేసీఆర్‌ లాంటి వ్యక్తి చరిత్రలో ఒక్కరే ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో 58 మంది లబ్ధిదారులకు రూ.58 లక్షల 6వేల 728 విలువైన కల్యాణలక్ష్మీ చెక్కులను అందించారు. ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉంటాయో కేసీఆర్‌కు బాగా తెలుసని, అందుకే హామీలు ఇవ్వకున్నా అమలు చేశారని తెలిపారు. కేసీఆర్‌ కిట్టునుంచి రైతుబంధు వంటి పథకాలు తెచ్చారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా నీరుగారుస్తోందని విమర్శించారు. తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిందని తెలిపారు. కేసీఆర్‌ వందేళ్లకు సరిపడా నీటి కోసం కాళేశ్వరం నిర్మిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పడావు పెట్టిందన్నారు. ఓటు విలువైందని, అందుకే ఆలోచించి పనులు చేసే నాయకుడికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీడీవో గణేశ్‌, డిప్యూటి తహసీల్దార్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ రేవంత్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ పవన్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ నాంపెల్లి రమేశ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్‌ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement