ప్రకృతి వనాలపై పర్యవేక్షణ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వనాలపై పర్యవేక్షణ అంతంతే..

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● కనుమరుగవుతున్న పచ్చదనం ● నిలువునా ఎండుతున్న మొక్కలు ● పట్టించుకోని పంచాయతీలు, అధికారులు

జగిత్యాలరూరల్‌: పల్లెల్లో పచ్చదనం పెంపొందించి, ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పంచాయతీకొక పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. ఈ వనాల్లో పలు రకాల మొక్కలు నాటేవారు. ఇవి కొన్నేళ్లు గ్రామ పంచాయతీల పర్యవేక్షణలో కొనసాగాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీలు పట్టించుకోకపోవడం.. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తడంతో పర్యవేక్షణ కరువైంది. ప్రారంభంలో కొన్నేళ్ల పాటు వీటి నిర్వహణ బాగానే సాగినా.. ప్రస్తుతం ఆయా గ్రామాల పాలకవర్గాలు, అధికారులు కనీస శ్రద్ధ చూపకపోవడంతో వనాల పరిస్థితి దయనీయంగా మారింది. వనాల సమీపంలో నీటి వసతి ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఒకప్పుడు ఏపుగా పెరిగిన పూలమొక్కలు, ఇతరత్రా ఇప్పుడు నీరులేక నిలువునా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.

ఊరికి దూరంగా.. ఉనికికి భారంగా..

జిల్లాలో 385 గ్రామపంచాయతీల్లో 419 పల్లె ప్రకృతి వనాలు, మరో 18 బృహత్‌ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిని ప్రజలకు అందుబాటులో కాకుండా ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంతో ఎవరూ అటువైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రూ.లక్షలు వెచ్చించిన ఈ వనాలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

పచ్చదనాన్ని వెదజల్లుతున్న పల్లెప్రకృతి వనాలు

జిల్లాలో కొన్నిచోట్ల గ్రామపంచాయతీ అధికారులు, పాలకమండలి సభ్యులు ప్రత్యేక దృష్టి సారించడంతో పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో వెదజల్లుతున్నాయి. నెలరోజులుగా వర్షాలు లేకపోవడం, పల్లె ప్రకృతి వనంలో నీటి వసతులు లేకపోవడంతో పచ్చని మొక్కలు ఎండిపోయే దశకు వచ్చాయి. ప్రస్తుతం నీరందిస్తే పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందించే పరిస్థితి నెలకొంది.

పంచాయతీలే పర్యవేక్షించాలి

ఈ వనాలు ఏర్పాటు చేసిన మొదటి మూడేళ్లు ఉపాధి హామీ పథకం కింద సంరక్షించాం. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలు ఎండిపోకుండా గ్రామపంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక దృష్టి సారించాలి. వాటి సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.

– రఘువరణ్‌, డీఆర్డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement