గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌లో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతోందన్నారు. సర్పంచ్‌ మహేష్‌, ఆత్మ చైర్మన్‌ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం నారాయణ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌ రావు, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్‌ హకీం, ఎంపీవో రవిబాబు, ఏఈ విజయ్‌ పాల్గొన్నారు.

నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ

హన్మాజీపేటలో నిర్వహించిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సర్పంచ్‌ బొడ్డు దామోదర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నక్కల రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాల ముకుందం, మాజీ సర్పంచ్‌ బొనగిరి నారాయణ పాల్గొన్నారు.

వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయం

వాల్మీకి జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. అంతర్గాంలో వాల్మీకీ జయంతిలో పాల్గొన్నారు. సామాన్యులకు అర్థమయ్యేలా రామాయణాన్ని రచించారని పేర్కొన్నారు. దేవయ్య వైద్య ఖర్చుల కోసం రూ.2.50 లక్షల ఎల్‌వోసీ ఇచ్చారు. సర్పంచ్‌ నోముల రమ్య, ఉపసర్పంచ్‌ బాలుగౌడ్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ

జగిత్యాల: పట్టణంలోని 14వ వార్డుకు చెందిన అపర్ణకు రూ.1.89లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఎమ్మెల్యే అందించారు. కౌన్సిలర్‌ స్వప్న, తిరుపతి, గిరిధర్‌ పాల్గొన్నారు.

వసతులు ప్రధానం

గ్రామాల అభివృద్ధికి వసతులు ప్రధానమని మా జీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జాబితాపూర్‌ పంచా యతీ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. శాని టేషన్‌, తాగునీరు వంటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement