● డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరించాలి ● కలెక్టర్‌తో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు పూర్తికి చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన 46 ఎకరాల రెవెన్యూ భూములను అటవీశాఖకు అప్పగించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్‌కు సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణితో కలిసి కలెక్టర్‌ను కలెక్టరేట్‌లో కలిశారు. నూకపల్లిలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వద్ద డంపింగ్‌యార్డు సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరూర్ క్యాంప్ రామాలయం సమీపంలో ఉన్న మైదానాన్ని మున్సిపల్‌కు కేటాయించేలా చూడాలన్నారు. ధరూర్ క్యాంప్ మైదానం చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్‌ట్రాక్‌కు నిధులు కేటాయించాలన్నారు. బీర్‌పూర్‌లోని కస్తూరిబా పాఠశాలను నూతన భవనంలోకి మార్చాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కేడీసీసీ సభ్యులు ముప్పాల రాంచందర్‌రావు పాల్గొన్నారు.
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి కళాశాల పనులు పరిశీలించారు. హాస్టల్ బ్లాక్, కిచెన్, తరగతి గదులు నిర్మించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. పాదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. తూకం, రవాణాపై అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, విద్యుత్, ప్రాథమిక చికిత్స వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రసూనాంబ, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ నిర్మాణ స్థలం పరిశీలన
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి, మోరపల్లి శివారులో నిర్మించనున్న యంగ్ ఇంటిగ్రేట్‌డ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, క్రీడలు, నైపుణాభివృద్ధి కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రావు, నాయకులు పెండెం రాములు, సర్పంచ్‌లు కట్ట రాజేందర్, గంగారెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి, సమిండ్ల శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, ముఖేష్ ఖన్నా, దుమాల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


