● 14 సెల్ఫోన్లు, ఏడు బైకులు స్వాధీనం
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం బండలింగాపూర్‌లో ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామిపై దాడికి పాల్పడిన వెల్లుల్ల గ్రామానికి చెందిన 14 మందిని అరెస్టు చేసినట్లు మెట్పల్లి సీఐ సురేశ్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. బండలింగాపూర్‌లో గురువారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న మహిళల పక్కనుంచి వెల్లుల్ల గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్‌లపై స్పీడ్‌గా వెళ్లడంతో అక్కడే ఉన్న ఆర్మీ సైనికుడు తిగుర్ల స్వామి వారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. స్వామిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 14 ఫోన్లు, ఏడు బైక్‌లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. మరికొందరు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. అర్టెయినవారిలో వెల్లుల్లకు చెందిన బావు రమేశ్, తుపాకుల స్వామి, బావు అఖిల్, లక్కంపెల్లి కార్తీక్, మర్రి నీరజ్, లక్కంపెల్లి కల్యాణ్, ఐలేని వంశీ, కల్లూరి మహేశ్, కల్లూరి వంశీ, కాంతి విశాల్, బొబ్బిలి నాగరాజు, పోచంపల్లి సాయి, మంచాల పవన్, కల్లూరి రవి ఉన్నారు.


