రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

Oct 24 2026 12:16 AM | Updated on Oct 24 2026 12:16 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): రైతు సమస్యల పరిష్కారానికి సహకార సంఘాలు చొరవ చూపాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భూషణరావుపేట సంఘం నిర్వహణలో జిల్లాలో మూడో స్థానంలో ఉందని, రైతులకు మరిన్ని సేవలు అందించి అభివృద్ధి సాధించాలన్నారు. రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలన్నారు. రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా భూషణరావుపేట గ్రామానికి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు కన్న చెరువులు ఎత్తు ప్రాంతంలో ఉండడంతో ఎత్తిపోతలే మార్గమని అధికారులు నిర్ణయించారని, ఎత్తిపోతల ద్వారా చెరువులు నింపేలా ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు గడ్డం స్వామిరెడ్డి, అల్లూరి దేవారెడ్డి, ఎండీ ముబీన్‌, సర్పంచ్‌ బద్దం మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్‌, ఎండీ హఫీజ్‌, కూన అశోక్‌, లోక నర్సారెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు వెలిచాల సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement